Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

చెన్నై : వరద సహాయక చర్యలలో చురగ్గా పాల్గొంటున్న RSS స్వయం సేవకులు

చెన్నై : ఎడతెరిపి లేకుండా  కురుస్తున్న కుంభవృష్టి  ప్రభావంతో పూర్తిగా వరదలలో చిక్కుకున్న చెన్నై నరగంలో రాష్ట్రీయ స్వయం స్వయం సేవక్ సంఘ్ స్వయం సేవకులు త్వరితగతిన స్పందించి సేవా, సహాయ కార్యక్రమాలు ప్రారంబించారు, కేంద్రం నుండి వచ్చిన NDRF బృందాలతో సమన్వయం చేసుకుంటూ జరుగుతున్న సేవాకార్యక్రమాల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. 

  • ఆరానగర్ ప్రాంతంలో దాదాపు 5000 కి పైగా ఆహార పోట్లలను అందజేయడం జరిగింది.
  • రెడ్ హిల్స్ ప్రాంతంలో దాదాపు 250 వనవాసిల కుటుంబాలకు సంబందించిన ఆవాస, ఆహార ఏర్పాటు చేయడం జరిగింది.
  • BV కాలని లో భజరంగ్ దళ్ కార్యకర్తలు 300 ల కుటుంబాలకు ఆహార పొట్లాలను అందించడం జరుగుతున్నది, వారికీ కావాల్సిన వైద్య సహాయార్థం చిన్న స్థాయిలో ప్రత్యెక క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది.
  • పెరంబూరు సహా చుట్టూ ప్రక్కల 15 ప్రాంతాలలోని వారికీ మూడు పుటల ఆహారాన్ని అందించడం జరుగుతున్నది. నిన్న రాత్రి దాదాపు 15000 కు పైగా చపాతిలను అందించడం జరిగింది.
  • కొలతుర్ ప్రాంతంలో దాదాపు 5000 కి పైగా ఆహార పోట్లలను అందజేయడం జరిగింది.
  • త్రిప్ల్కేన్ ప్రాంతంలో దాదాపు 2000 పైగా ఉన్న బాదితులకు ఆహారాన్ని అందించడం జరుగుతున్నది
  • ఎగ్మోర్ రైల్వే స్టేషన్ లో నీరిక్షిస్తున్న ప్రయాణికులకు స్థానిక స్వయం సేవకులు  చాయ్ (టి) అందించడం జరిగింది

రెండు లారీల సహాయ సామాగ్రి తో వెల్లూరు జిల్లాకి బయల్దేరిన ప్రత్యెక బృందం :

చెన్నై తో పాటుగా తీవ్ర ప్రభావానికి లోనైనా వెల్లూర్ జిల్లాకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సేవా విభాగం సేవభారతికి చెందిన ఒక మహిళా కార్యకర్త తో సహా 13 మంది కలిగిన ప్రత్యెక బృందం రెండు లారీల సహాయ సామాగ్రి ఆహార సామగ్రిని తీసుకుని బల్దేరింది, ఈ రోజు ఉదయం తో అక్కడ కూడా సేవా కార్యక్రమాలు ప్రారంబించడం జరిగింది.    

24X7 సేవల కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్ :

చెన్నై వరద ప్రభావ ప్రాంతాలలో  సేవాభారతి 24 X 7 పాటు సేవలను కొనసాగించుటకు వీలుగా ప్రత్యెక హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేయడం జరిగింది ఆపదలో ఉన్నవారు ఏ సమయంలోనైన శ్రీ రాజేష్ వివేకానందన్ Ph No 09840260631 , శ్రీ శ్రీనివాసన్  Ph No 09789023996, శ్రీ దురై శంకర్ Ph No 09444240927 లను ఏ సమయంలో నైన సంప్రదించవచ్చు.

విరివిగా సహాయానికి " సేవా భారతి చెన్నై " పిలుపు :

ఆకస్మిక వర్షంతో అతలాకుతలం అయిన చెన్నై నగరంలో సేవా కార్యక్రామాలు నిర్వహించడానికి గాను విరివిగా ఆర్ధిక సహాయం చేయాల్సిందిగా "సేవా భారతి చెన్నై" పిలుపునిచ్చింది , బ్యాంక్ ఖాతా తదితర వివరాలు క్రింద ఇవ్వడం జరుగుతున్నది.
For Chennai Flood relief   Account
‘SEVABHARATHI TAMILNADU’
Andhra Bank,
Chetpet branch,
Chennai
A/C no
.078410011014427
IFSCode ANDB0000784
MCIR code : 600011005. Income Tax 80 G Exemption is available.




   
చెన్నై : వరద సహాయక చర్యలలో చురగ్గా పాల్గొంటున్న RSS స్వయం సేవకులు Reviewed by JAGARANA on 10:05 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.